Thursday, 3 January 2013

JOKES

JOKES




  •       డాక్టర్ వెంకయ్యగారూ... జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది"     చెప్పాడు డాక్టర్.
              వెంకయ్య : "అమ్మయ్య... బతికించారు. అయితే అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి"     చెప్పాడు వెంకయ్య



  •    "నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి    కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని. 
             వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి."ఫర్లేదు నాన్నా...   మీరంతా  నిద్ర   పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా



  • "పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

    "
    అలాగా.... అయితే గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.  

  • "ఏమిటి పిన్నిగారు అంతకోపంగా ఉన్నారు?" శ్రామలమ్మను అదిగింది వరమ్మ.
    "
    ఇవాళ ముచ్చటపది RTC Bus standలో weighing machine ఎక్కి రూపాయి నాణెం వేస్తే.......

    ఒక్కసారే ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది" కోపంగా అంది శ్యామలమ్మ 



.  
  • డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు వాసు.

    " రెండెందుకండీ?" అమాయకంగా అడిగాడు షాపువాడు.
    " సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి.." 

  • "రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్.
    " ఎందుకండీ?" అన్నాడు చంద్రం.
    "
    ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్.
    "
    మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం



0 comments: